Chorantians Bible Quiz
View Allనాకున్నది నీవేనని
నాకున్నది నీవేనని
నను కన్నది సిలువేనని (2)
నీవున్నది నాలోనని
నేనున్నది నీకేనని
సాక్ష్యమిచ్చెద యేసయ్యా
నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది||
గుడ్డివాడను నేనేనని
నీ చూపు ప్రసాదించేవని (2)
చెవిటి వాడను నేనేనని
నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||
మూగవాడను నేనేనని
నీ మాటలు పలికించేవని (2)
అవిటివాడను నేనేనని
నీ నడకలు నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||