నాలో నీవు - నీలో నేను ఉండాలనీ

Shalem Raju
7056 Views

పల్లవి: నాలో నీవు – నీలో నేను ఉండాలనీ
నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా – ప్రియుడా యేసయ్యా

1. కడలి యెంత ఎగసిపడినా – హద్దు దాటదు నీ ఆజ్ఞలేక క
లతలన్ని సమసిపోయే – కన్న తండ్రి నిను చేరినాక
కమనీయమైనది నీ దివ్య రూపము
కలనైనా మరువను నీ నామ ధ్యానము ॥నాలో నీవు॥

2. కమ్మనైనా బ్రతుకు పాట – పాడుకొందును నీలో యేసయ్యా
కంటి పాప యింటి దీపం – నిండు వెలుగు నీవేకదయ్యా
కరుణా తరంగము తాకేను హృదయము
కనురెప్ప పాటులో మారేను జీవితం ॥నాలో నీవు॥

3. స్నేహమైనా సందడైనా – ప్రాణమైనా నీవే యేసయ్యా
సన్నిధైనా సౌఖ్యమైనా – నాకు ఉన్నది నీవేకదయ్యా
నీలోనే నా బలం నీలోనే నా ఫలం
నీలోనే నా వరం నీవేగ నా జయం

॥నాలో నీవు !!

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account