నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా

161 Views

నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2)

ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account