నమ్మదగిన దేవుడవు యేసయ్యా

520 Views

నమ్మదగిన దేవుడవు యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2)
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా (2)
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము     ||నమ్మదగిన||

నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము (2)
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2)         ||నీ శరణు||

నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే (2)
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2)         ||నీ శరణు||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account