నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్య
Hosanna Ministriesనమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్య
అపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా
చెరనుండి విడిపించి చెలిమితో బంధించి
నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును
నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకెళ్ళ సంబరాలు మూగబోయెను
నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందబారితులై సీయోనుకు తిరిగివచ్చెను || నమ్మదగిన |
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జరిలమైన త్రోవలన్ని దాటించితివి
సంమృద్ది జీవముతో పొషించితివి
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాఆదరణను పొంది నీ క్రియలను వివరించగా [నమ్మదగిన |
నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి
అర్హమైన పాత్రగా నను నిలుపుకుంటివి
ఆదరణకర్తవైన విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము నమ్మదగిన |