నన్నింతకాలం కాపాడినావు

826 Views

నన్నింతకాలం కాపాడినావు
నీ కృపతో నన్ను బ్రతికించినావు
అ|ప: నీ కృపలకై వందనం నీ ప్రేమకై వందనం

ఏ తెగులు నా గుడారం సమీపించనీయక
నా క్షేమాధారమై భద్రపరచినావు
ఏ దిగులు నా హృదిని కలవరింపజేసిన
నాకు తోడైయుండి బలపరచినావు
నా కష్టసమయాలలో వెన్నంటి నిలిచావు
నా ఎబెనెజరువై నన్నాదుకున్నావు
నా కాపరీ వందనం నా రక్షకా వందనం

ఈ ఘడియలో నేను నిలిచియున్నానంటే
యెడతెగక నిలిచున్న నీ వాత్సల్యమే కారణం
నే జడియకుండా ముందుకు కొనసాగుటకు నీ
ఆలోచన చొప్పున నను నడిపించు ప్రతిక్షణం
నీలో స్థిరముగా నే నిలిచియుండుటకు
నీయందు నే నిలిచి బహుగా ఫలించుటకు
నీ బాటలో నడుపుమా నీ శక్తితో నింపుమా

ఎందరో గొప్పవారు గతియించిపోయిన
ఎందుకో నన్ను నీవు బ్రతికించుచున్నావు
ఏ మంచి లేని నన్ను నీవు కనికరించి
నాదు ఆయుష్కాలం పొడిగించుచున్నావు
నన్నింక బ్రతికించుటలో నీ చిత్తమేంటో
నా ద్వారా జరగవలసిన నీ పనియేంటో
బోధించి నడిపించుమా నీ పాత్రగ నన్నుంచుమా

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account