నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా

Sathish Kumar
350 Views

నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా
నేను పాపము చేసినా చూపావు నీ దయా
నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా
సిలువ నీడలో నన్ను దాచుమయ్యా
లోకమంతా నన్ను దోషిగ చూసినా
ప్రేమతోనే నన్ను చేరదీసిన           ||నన్ను||

నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాథ చేసి పోయినా
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా          ||నన్ను||

నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా
నీ వారసునిగా నన్ను ఎంచిన
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా            ||నన్ను||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account