నను పిలిచిన దేవ
Benny Joshuaనను పిలిచిన దేవ – నను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా. (2)
నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చిoచునది నీ కృప మాత్రమే (2)
నీ కృపయే కావలెను నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్య.. (2) యేసయ్యా…..
ఒంటరిగా ఏడ్చినపుడు ఒదార్చువారు లేరు
తోట్రిల్లి నడిచినపుడు ఆదుకోన్నవారు లేరు. (2)
బిగ్గరగాఏడ్చినపుడు కన్నీరు తుడిచే కృప. (2)
నేనని చెప్పుటకు నాకేమీ లేదు
సామర్ధ్యం అనుటకు నాకనీ ఏమీ లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. (2)