నరుడు ఏ పాటివాడని

22 Views

నరుడు ఏ పాటివాడని సృష్టిని చేసావు
మానవుడు ఎంత ఘనుడని ఈ ప్రకృతిని ఇచ్చావు || 2 ||
వానికోసమే ప్రభువా సమస్తము చేసావు
నీ చేతి పనుల మీద అధికారమిచ్చియున్నావు || 2 || || నరుడు ||

చరణం 1:
ఉదయములో మంచు కురిసే వేళలో
కారు మబ్బులలో కాంతి వచ్చే సమయములో
చలికాలంలో చల్లగా వీచే గాలిలో
సువాసనలో మల్లెలు పూసే తరుణములో || 2 ||
పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు
అది నీవే చేసావని మహిమ పరచక ఉన్నారు || 2 || || నరుడు ||

చరణం 2:
సాయంత్రములో గలగల పారే సెలయేరులో
పక్షులకిలకిలలో కోయిల కూసే గానములో
ఆ కొండలలో ఎదురుగా ఉన్న లోయలలో
వృక్షాలలో ఆ పూల తోటలో || 2 ||
పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు
అది నీవే చేసావని తెలియకనే జీవిస్తారు || 2 || || నరుడు ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account