నే స్తుతించెదను యేసు నామమును

261 Views

నే స్తుతించెదను యేసు నామమును
భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని
నిత్యం నిత్యం నే స్తుతించెదను      ||నే స్తుతించెదను||

ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2)
పాపిని నన్ను రక్షించుటకై
చూపెను ప్రేమనపారముగా (2)     ||నే స్తుతించెదను||

పాపములన్నియు బాపుటకై
శాపములన్నియు మాపుటకై (2)
ఏ పాపమెరుగని ఆ పావనుడు
శాపగ్రాహియై చావొందెను (2)     ||నే స్తుతించెదను||

శోధన కాలముల యందున
వేదన కాలముల యందున (2)
నాధుడు యేసు మనతోడనుండ
అంతమేగా మన చింతలకు (2)     ||నే స్తుతించెదను||

ఎనలేని ప్రేమతో కౌగిలించెను
ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2)
మహామహుండు మహిమ ప్రధానుడు
మహిమతో వచ్చును మేఘముపై (2)     ||నే స్తుతించెదను||

రాజాధిరాజు ప్రభు యేసే
దేవాదిదేవుడు మన యేసే (2)
పరమందు దూతలు యిహమందు నరులు
పాడుడి ప్రభునకు హల్లెలూయా (2)     ||నే స్తుతించెదను||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account