నేడు యేసు లేచినాడు

245 Views

నేడు యేసు లేచినాడు
నేడు యేసు లేచినాడు
మనమానందము నొందుదాము (2)      ||నేడు||

పరలోకము నుండి దూతలు
దిగి వచ్చిరి సమాధికి (2)
భద్రముగా చేసిరిగా
బహు భద్రముగా చేసిరిగా         ||నేడు||

మగ్దలేనే మరియ వేరొక మరియ
సుగంధ తైలము తెచ్చుకొని (2)
పూయుటకు వెళ్లిరిగా
బహు పూయుటకు వెళ్లిరిగా         ||నేడు||

వేకువ జామున యేసు ప్రభుండు
తోటలో సంచరింపంగ (2)
తోటమాలి అనుకొనెను
బహు తోటమాలి అనుకొనెను         ||నేడు||

నేను ఇంకను తండ్రి యొద్దకు
త్వరగా వెళ్లిపోలేదు (2)
కనుక నన్ను ముట్టవద్దు
మరియమ్మ నన్ను ముట్టవద్దు           ||నేడు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account