నీ చేతి కార్యములు సత్యమైనవి

164 Views

నీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2)
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2)

బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా

నీ ఆలోచనలు గంభీరములు
నీ శాసనములు హృదయానందకరములు (2)
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు||

ఎవర్లాస్టింగ్ ఫాదర్
యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్

నిత్యుడైన తండ్రి
నీ కృప నిరతము నిలచును
నిత్యుడైన తండ్రి – నా యేసయ్య

నీ రూపము ఎంతో మనోహరము
నీ అనురాగము మధురాతి మధురము (2)
నీ నామము నిత్యము పూజింపతగినది
నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account