నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది

432 Views

నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది (2)
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము (2)

పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2)       ||దేవా||

నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)
నను మన్నించుమా నా తండ్రి (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account