నీ నామమునే కొనియాడెదను
Raj Prakash Paulనీ నామమునే కొనియాడెదను నీ సన్నిధిలో నే పాడెదను
నీవే నా జీవము నీవే నా స్వాస్ధ్యము నీ నామమునే . . ఆ . .
1. నా కోసమే ఈ భువికొచ్చి నీ ప్రాణమే అర్పించి నీ రక్షణే నొసగితివే
నీ మహిమను విడచి వచ్చి నీ మార్గము నాకందించి నీ కృపను చూపించితివే
ఏలాగు వర్ణింతునయ్యా యేసయ్యా నీ గొప్ప త్యాగంబును
ఏలాగు వర్ణింతునయ్యా యేసయ్యా నీ అనురాగంబును
2. ఆత్మ స్వరూపుడా ఆది సంభూతుడా నీ ఆత్మ బలమును కుమ్మరించుమయ్యా
నీతి స్వరూపుడా నరరూపధారుడా పునరుత్ధాన శక్తితో ఉజ్జీవింపుమయ్యా
నీదు సేవలో నేను సాగెదన్ యేసయ్యా
నీదు ప్రేమను నీదు మహిమను నీదు నామమును నేను చాటెదను