నీ రూపు చూడ నేనాశపడితి

202 Views

నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి (2)
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)

పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా (2)
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2)         ||హల్లెలూయా||

నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే (2)
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)
నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2)          ||నీ రూపు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account