నీ సేవలో
Joshua Shaikనీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి
కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి
స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
1. జీవితాన సోలిపోయా – చేరదీసి దయచూపవా
హోరుగాలి సాగరాన – చేయి చాపి దరిచేర్చవా
వేచివున్నా నే ఆశతో – బలము నింపు నీ ఆత్మతో
ఏకమై నా తోడుగా – భయము లేదు నీవుండగా
ఎదలో భారం మోసినావు – ఎంత ప్రేమ నా యేసయ్య
2. ఈ జగాన నీడ నీవై – కాచినావే కరుణాత్ముడా
ఎన్నడైనా వీడలేదే – మార్పులేని మహనీయుడా
చేరదీసే నీ స్నేహము – ఎదురుచూసే నా కోసము
నీ కృపా నా క్షేమము – మధురమైన సంకల్పము
నడిపే నన్ను నీదు కాంతి – ఎల్లవేళ నా యేస