నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
Joshua Shaikనీ స్వరమే విన్నా – నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై – నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన – నీ కోసమే
ఆరాధనా – నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
1. నిన్ను చూడ – నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ – విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ – నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
2. ఆశతీర – యేసు నీలో
పరవసించే – నా ప్రాణము
ప్రాణనాథా – ఎన్నడైనా
మరువలేను – నీ త్యాగము
కానరాదే – ఈ జగాన
నిన్ను పోలి – ఏ బంధము
ఆరిపోని – అనుబంధము