నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా

211 Views

నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2)
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా

నా మార్గమంతటిలో నను కాపాడినావు (2)
నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2)           ||దేవా||

మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2)
ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2)           ||దేవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account