నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని

310 Views

నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని
ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా
ఆశలు తీర్చే నా మెస్సయ్యా (2)
నువ్వంటే ఇష్టము నా యేసయ్యా

నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2)

నీ వెంటే నేను నడవాలని
నీ ఇంటిలోనికి రావాలని (2)
నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా
నీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2)
అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం

అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2)           ||నువ్వంటే||

ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో
ఈ లోకంలో నే పడియుండగా (2)
నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా
నీ కరుణతో నను నీవు నడిపావయ్యా (2)
అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం

అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2)           ||నువ్వంటే||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account