నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)

419 Views

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account