నీలాంటి ప్రేమ ఎవరు చూపలేరు
నీలాంటి ప్రేమ ఎవరు చూపలేరు
నీలాంటి త్యాగం ఎవరు చేయలేరు
నీలాంటి శ్రమలు ఎవరు పొందలేరు (2)
నిన్ను నమ్ముకుంటే చాలు (2) II నీలాంటి II
కళ్లున్న వారేగా కనపడలేదా నీవు
చెవులున్న వారేగా వినబడలేదా నీ స్వరము (2)
ఆదియందు ఉన్నావు గాని
అయ్యా నిన్నెరుగకుంటిని
చీకటి లోనే వెలుగై యున్నావు
అయినా నిన్ను చేరకుంటిమి II నీలాంటి II
ప్రాణం పెట్టావు నీవే నిత్య జీవము
విడుదల నిచ్చావు నీవంటి వారెవ్వరు (2)
తప్పి పోయిన గొర్రెలన్నిటిని
సమకూర్చే మంచి కాపరి
దీవిని విడచి భువికేతెంచిన
దివ్యమైన ప్రేమనీది II నీలాంటి II