నీవు ప్రార్థన చేయునప్పుడు
నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)
నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)
ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే||
బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)
ఆ జయము మరచితివా ||పొందియున్నాననే||
గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)
ఈ రక్షణానందం ||పొందియున్నాననే||