నూతన పరచుము దేవా

199 Views

నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము (2)
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును        ||నూతన||

శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)         ||పాతవి||

ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)         ||పాతవి||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account