ఊహకందని ప్రేమలోన

Hosanna Ministries
67 Views

ఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు.. “ఊహకందని ప్రేమ”

తల్లడిల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది..”2″
అదియే..ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే..”2″ “ఊహకందని ప్రేమ”

నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా..”2″
అదియే..ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి..”2″ “ఊహకందని ప్రేమ”

దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. “2”
నీవే నీవే యేసయ్య నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసిన అలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా ..”2″ “ఊహకందని ప్రేమ”

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account