Chorantians Bible Quiz
View Allపాతాళంలో ఆత్మల ఆర్తనాదం
పాతాళంలో ఆత్మల ఆర్తనాదం
భూలోకంలో సువార్తల సునాదము (2)
మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం
ఎంచుకో స్వర్గం – నరకం (2)
గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో||
ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది
విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2)
రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ
రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో||
ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది
వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2)
ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది
ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2) ||పాతాళంలో||