పోరాటం ఆత్మీయ పోరాటం
Hosanna Ministriesపోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)
నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥
నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥
ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥