ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
John Weslyప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్ (2)
ఓ శాంతిధాత నా యేసుదేవా భజియింతును అనుక్షణము (2)
నా బ్రతుకు దినములన్నియును నీ ప్రేమగీతం పాడెదను
నను దర్శించిన నీ ప్రేమవాక్కును ఆశ్చర్యమైన నీ కృపను (2)
మార్గమందు చిక్కులొచ్చినా చేయలేవని నిందలేసినా (2)
ప్రకటింతును ప్రస్తుతింతును (2)
ప్రకటింతును
నను బలపరచే నీ గొప్ప శక్తిని నను స్థిరపరచై నీ బాహుబలమును
ఎన్నడు తరగని ప్రభావ మహిమను ఎన్నడు మారని వాగ్దానముల్ (2)
చింతలెన్ని నాకు కల్గినా నిందలెన్ని నన్ను చుట్టినా (2)
ప్రస్తుతింతును (2)
ప్రకటింతును
ప్రకటింతును