ప్రాణప్రియుడా నీవే నా ప్రాణము

Palepogu Lazarbabu
212 Views

ప్రాణప్రియుడా నీవే నా ప్రాణము, నీవే నా గానము
నీవేనా సర్వము
నా ప్రతీ పదం నీ దానమే – నా శృతిలయలు నీ కోసమే

ఇహలౌకిక జ్ఞానం విషకోరలకు ఆహుతి చేసినా
రూపులేని శిలవై పగిలిన పాత్రవై మిగులగా
సిలువలో శ్రమ పొంది నీ పోలికనిచ్చి
నిత్య ప్రమాణముతో క్రొత్తపాత్రగా మలిచి
చెదరని జ్ఞాపికవై నా మదిలో ఒదిగిన శిల్వ్పకారుడా
నా రూపం నీ ప్రతి రూపమే నా అణువణువు నీ కొసమే

స్వరమందలములో తీగలు సడలి స్వరమే మూగబోయినా
అపశ్ళతులే నా జీవిత గమనపు స్థితినే మార్చినా
నా నోటిని కాల్చి స్వరమును శృతి చేసి జీవస్వరములు – నాలో పలికించి
మహిమలోనిను ఘనపరచుటకు నడిపించుచున్న నజరేయుదా
నా స్వరము కృపా వరమే స్తుతిగానములు నీ కొసమే

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account