Chorantians Bible Quiz
View Allరారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)
ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే…
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్… ||రారాజు||
వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగ మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై….. ||రారాజు||
మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై….. ||రారాజు||