రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్

144 Views

రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట (2)         ||రారే||

మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2)         ||రారే||

రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2)         ||రారే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account