Chorantians Bible Quiz
View Allసజీవుడవైన యేసయ్యా
Hosanna Ministriesసజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో (2)
ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)
ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము
దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన||
క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)
నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన||
నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే
నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||