సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా

177 Views

సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు||

గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
శత్రువల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే||

బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు (2)     ||నీకే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account