సన్నుతింతుమో ప్రభో

157 Views

సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో (2)
కన్న తండ్రి కావుమా (2)
కలుషము నెడబాపుమా         ||సన్నుతింతుమో||

నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా (2)
పాతక జన రక్షకా (2)
పతిత పావన నామకా         ||సన్నుతింతుమో||

మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా (2)
దేవా మానవ నందనా (2)
దివ్య సుగుణ మందనా         ||సన్నుతింతుమో||

ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా (2)
కామిత ఫలదాయక (2)
స్వామి యేసు నాయక         ||సన్నుతింతుమో||

పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో (2)
నీ పవిత్ర నామమున్ (2)
నిరతము స్మరియించెదన్         ||సన్నుతింతుమో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account