సర్వ చిత్తంబు నీదేనయ్యా

162 Views

సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును         ||సర్వ చిత్తంబు||

ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా          ||సర్వ చిత్తంబు||

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా          ||సర్వ చిత్తంబు||

ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా         ||సర్వ చిత్తంబు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account