శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
Raj Prakash Paulశాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
నిత్యుడవగు తండ్రి నీవైనావే
రక్షణ ఆనందాన్ని నా కందించి
పరలోకపు వారసుడ్ని చేసావే
1. నా అడుగులను క్రమపరచి నా హృదయమును స్ధిరపరచి
నీదు రక్తములో నను శుద్ధుని చేసితివే
నను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నను మలచి
నీ దీవెన కర్హుడుగా చేసిన దేవా నీకే స్తోత్రము
2. నీ వాక్యం నా యందుంచి దుష్టుడిని జయింపచేసి
సత్యమైన వెలుగులోనికి నడిపించితివే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని
నీ సాక్షిగా సంపూర్ణ శక్తితో దేవా నన్ను నిలుపు