సేవించెదను నిన్నిలలో

AR Steevenson
1091 Views

సేవించెదను నిన్నిలలో జీవించు దినములన్నిటిలో
పూజించుటకు యోగ్యుడవు యుగములలో
స్తోత్రించెదను జనములలో

1. పొరుగువారంతా కూడుకొని కష్టకాలమున నన్నుగని
నీ దేవుడు ఏమాయెనని హేళన చేసినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను – సాక్షిగ నే నిలిచెదను

2. అధిపతులు మాట్లాడుకొని కూటసాక్షుల మాటవిని
నిన్ను విడిచిపెట్టాలని నను బెదిరించినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను – సాక్షిగ నే నిలిచెదను

3. బంధువులు నను చేరుకొని మాతో ఉండుట కూడదని
నాకున్నదంతా దోచుకొని నను వెలివేసినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను – సాక్షిగ నే నిలిచెదను

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account