Chorantians Bible Quiz
View Allసిలువ చెంత చేరిననాడు
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర ||సిలువ||
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ||
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము ||సిలువ||