శ్రమయైన బాదైనా

Raj Prakash Paul
1806 Views

శ్రమయైన బాదైనా -హింసలెన్ని ఎదురైనా
క్రీస్తుప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా శోదనలే ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు -భీకరుడై వచ్చుచున్నాడు (2)
సర్వోన్నతుడు మేఘరూఢిగా తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం మహ ఉగ్రతతో రానున్నాడు
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
శౌరుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహిమేశ్వరుడు సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాదిదేవుడు రాజాదిరాజు ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు
విశ్వాసమే నా బలము – నిత్యజీవం చేపట్టుట్టే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని -ఆ లోకములో నిరంతరము జీవింతును
విమోచకుడు సజీవుడు నా కన్నులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో పాలించుటకే పోరాడెదను

ఓ క్రైస్తవా సోలిపోకుమా -తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా -నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరడు -నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము -యేసుని చేరా వెయ్యి ముందడుగు
(శ్రమయై న )

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account