స్థిరమైన ప్రేమ చూపుచు
పల్లవి
స్థిరమైన ప్రేమ చూపుచూ
నన్నఆదరించి కాపాడిన యేసు దైవమా
స్థిరమైన ప్రేమ చూపుచూ
నన్ను ఆదరించి కాపాడిన యేసు దైవమా
రాబోతున్న దినములన్నియు
ఆనందం అభివృద్ధి ప్రసాదించుమా
స్థిరమైన ప్రేమ చూపుచూ నన్నఆదరించి కాపాడిన యేసు దైవమా
చరణం 1
బాధలందు కృంగిపోకుండగా
నోట నిత్యము నీ కీర్తి ఉంచుమా
నీకు ప్రథమ స్థానమిచ్చు రీతిగా
నీ చిత్తమేదో తెలియజేయుమా
సమయోచిత వివేకం సరిపోయిన సహాయం
కృపాక్షేమములు పంపుమా
స్థిరమైన ప్రేమ చూపుచూ
నన్నఆదరించి కాపాడిన యేసు దైవమా
చరణం 2
శోధనందు లొంగిపోకుండగా
నాకు హెచ్చుగా నీ శక్తి పంచుమా
నీలో నిలిచి ఫలములిచ్చు రీతిగా
నీ దీన మనసు కలుగజేయుమా
సమయోచిత వివేకం సరిపోయిన సహాయం
కృప క్షేమములు పంపుమా
స్థిరమైన ప్రేమ చూపుచూ
నన్ను ఆదరించి కాపాడిన యేసు దైవమా
చరణం 3
భక్తి యందు తగ్గిపోకుండగా
నాలో నిండుగా నీ వాక్కు నింపుమా
నీకు తగిన మహిమనిచ్చు రీతిగా
నీ మార్గమందు నడువజేయుమా
సమయోచిత వివేకం సరిపోయిన సహాయం
కృపా క్షేమములు పంపుమా
స్థిరమైన ప్రేమ చూపుచూ
నన్నఆదరించి కాపాడిన యేసు దైవమా




















