Chorantians Bible Quiz
View Allస్తోత్రింతుము నిను
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా (2)
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు (2)
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి (2)
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు (2)
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము||