స్తుతి పాడెద నే ప్రతి దినము

419 Views

స్తుతి పాడెద నే ప్రతి దినము
స్తుతి పాడుటే నా అతిశయము
దవళవర్ణుడా మనోహరుడా
రత్నవర్ణుడా నా ప్రియుడా

ఆరాధించెద అరుణోదయమున
అమరుడా నిన్నే ఆశ తీరా
ఆశ్రిత జనపాలకా
అందుకో నా స్తుతి మాలికా

గురి లేని నన్ను ఉరి నుండి లాగి
దరి చేర్చినావే పరిశుద్దుడా
ఏమని పాడెద దేవా
ఏమని పొగడెద ప్రభువా

మతి లేని నన్ను శృతి చేసినావే
మృతి నుండి నన్ను బ్రతికించినావే
నీ లతనై పాడెద దేవా
నా పతివని పొగడెద ప్రభువా

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account