తల్లిలా ఆదరణ

56 Views

||పల్లవి||
తల్లిలా ఆదరణ ఎల్ షద్దాయి రొమ్మున
హేతువు చూడని నీ ప్రేమా
హత్తుకున్నది హృదయాన (2)

||అ.ప||
ఎల్ షద్దాయి ఆదరణ (2)
నా ఆవేదనను ఆరాధన గా మార్చివేసావే (2)
మార్చివేసావే

నీ సన్నిధే మేలు నీ ప్రేమయే చాలు
అమ్మ కన్న కమ్మనైనది (2)
ప్రభు యేసు నీ ప్రేమ
వివరించ వీలవునా నన్నెన్నడు వీడనన్నది

1. కడసారి కలవరి యాత్ర లో –
తల్లడిల్లిన తనయా తల్లితో
అమ్మ ఇదిగో నీ కుమారుడెయని –
ప్రాణాలే పోతున్నా ఆదరించావే
తల్లినే నిర్మించిన మనసుకు ఉండదా ఈ ప్రేమ
తల్లి లాంటి ఆదరణే తుడిచినది నా కన్నీళ్లే

||ఎల్ షద్దాయి ఆదరణ||

2. ప్రతిసారి ప్రభుని రొమ్మున –
ఆనుకునే నీ ప్రియ శిష్యునితో
ఇకపైనా ఆ రొమ్ము ఉండబోదని
ఇదిగో నీ తల్లి అని ఆదరించావే
అనాథగా నన్నెన్నడు విడువనిధి నీ ప్రేమ
క్రీస్తు ప్రేమ నుండి నన్నేది యెడబాపదు

||ఎల్ షద్దాయి ఆదరణ||

3. పిల్లలు పోయిన ఎలుగు బంటిలా –
శత్రువునే చీల్చివేసావే
అరచేతులలోనే చెక్కుకున్నావే –
రోషముతో ఒడిలో దాచుకున్నావే
నన్ను ముట్టిన వాడు నీ కన్ను గుడ్డునే ముట్టాడని
నా యెడల నీ ప్రేమ – ఎందాకైన వెళుతుంది

||ఎల్ షద్దాయి ఆదరణ||

4. దినమెల్ల చేతులు చాపావు –
లోబడనోల్లని మా యెడ నీ ప్రేమ
కోడి తన పిల్లలను చేర్చునట్లుగా –
నిరతము రెక్కల క్రింద దాచియుంచావే
బలమైన మరణాన్ని లెక్క చేయనిది ఈ ప్రేమ
రక్తాన్నే కార్చినది పాణాలే అర్పించినది

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account