తరచి తరచి చూడ తరమా

447 Views

తరచి తరచి చూడ తరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసు వంటి మిత్రుని లోకమందున
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలా మనగలమా
యేసు వంటి స్నేహితుని విశ్వమందున

లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా
ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో
నేల మంటిలోన పరమార్ధం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా
నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై
జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2)         ||తరచి||

లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు
యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు
పదివేలలోన అతి కాంక్షణీయుడు
కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును
కల్వరిగిరిలోన కార్చెను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2)         ||తరచి||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account