తరములు మారుచున్నవి

406 Views

తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి..
క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు?
వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి..
భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు?
దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది..
అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు?
మార్పు చెందరెందుకు?            ||తరములు||

సంద్రంలో ఉన్న రాళ్లను చూడు
అలల తాకిడికి కరిగిపోవును
శిఖరముపై ఉన్న మంచును చూడు
సూర్యుని వేడిమికి కరిగిపోవును (2)
ప్రభువును నమ్మిన ప్రజలను చూడు (2)
దేవుని మాటలకు కరగరెందుకు?
బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?
సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా..
నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు?
పాపము చేయుటెందుకు?            ||తరములు||

క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి
పాపములో ఉన్న స్త్రీలను చూడు
వాక్యం విని పాపం మానివేసిరి (2)
దేవుని ఎరిగిన పిల్లల చూడు (2)
భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
దైవ వాక్యమును ఆచరించరెందుకు ?
దేవుని ఎరిగి ఉండిన.. దైవముగ మహిమపరచిన..
కన్న తండ్రి మనస్సు తెలిసిన.. ప్రియమైన పిల్లలు కావాలి
మనసులు మార్చుకోవాలి            ||తరములు||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account