తెలియక వారు సిలువ వేశారు
Sathish Kumarతెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్ధించాడు యేసు (2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేదెవరు? ॥తెలియక॥
1. తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేదెవరు? ॥తెలియక॥
2. పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు?
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేది ఎవరు?