Chorantians Bible Quiz
View Allతొలకరి వాన దీవెనలు కురిపించు వాన
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి||
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన||
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||