ఉతక మీద తలుపు తిరుగు రీతిగా

213 Views

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరిగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకో
వేకువనే లేచి పనులు చూచుకో
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2)

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
అయినను అవి క్రమము గానే నడచును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రం బలము లేని జీవులు (2)
పేరు సందులలో నివసించును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account