వాక్యమే శరీర ధారియై వసించెను

133 Views

వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)

కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను      ||వాక్యమే||

ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను        ||వాక్యమే||

పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ (2)
కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే        ||వాక్యమే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account