వర్ష ధారగా రావా నా యేసయ్యా

124 Views

వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఎండిపోయిన భూమి నేనయ్యా (2)
ఈ నేలలో పంట లేదయ్యా
నా మనస్సులో శాంతి లేదయ్యా (2)
వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఫలింపజేయుమా పరమేశ్వరా (2)

పాపములన్ని పరిహరించుమా
భయములెల్ల పారద్రోలుమా (2)
యేసు నాథుడా నా రక్షకా (4)
నీదు కృపతో ఆదరించుమా (2)        ||వర్ష||

మనో వ్యధలను గుణ పరచుమా
తనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2)
యేసు నాథుడా పరమ వైద్యుడా (4)
గాయములెల్ల స్వస్థపరచుమా (2)        ||వర్ష||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account