Chorantians Bible Quiz
View Allవేల్పులలో బహుఘనుడా
Hosanna Ministriesప|| వేల్పులలో బహుఘనుడా – యేసయ్యా
నిను సేవించు వారిని – ఘనపరతువు
నిను ప్రేమించు వారికి సమస్తము – సమకూల్లి జరిగింతువు
నీయందు భయఖభక్తి గల వారికి. శాశ్వత కృప నిచ్చెదవు
సుందరుడైన యోసేపును – అంధకార బందువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు – ఫలించెడి కొమ్మగ చేసావు
మెరుగుపెట్టి నను దాచావు – నీ అమ్ముల పొదిలో
ఘనవిజయము నిచ్చుటకొరకే – తగిన సమయములో
ఉత్తముడైన దావీదును – ఇరుకులేని విశాల స్థలములో
ఉన్నత కృపతో నింపావు – ఊహించని స్థితిలో నిలిపావు
విలువపెట్టి నను కొన్నావు – నీ అమూల్యమైన రక్తముతో
నిత్య జీవమునిచ్చుట కొరకు – మహిమ రాజ్యములో
పామరుడైన సీమోనును – కొలతలేని ఆత్మాభిషేకముతో
అజ్ఞానము తొలగించావు – విజ్ఞాన సంపదనిచ్చావు
పేరుపెట్టి నను పిలిచావు – నిను పోలినడచుటకు
చెప్ప శక్యముకాని ప్రహర్నముతో – నిను స్తుతించెదను